భాగమతి 2 ఆలోచనలలో అనుష్క !
ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా అనుష్క 50వ సినిమాకు సంబంధించిన వార్తలు ఆమె పుట్టినరోజునాడు విపరీతంగా హడావిడి చేశాయి. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన యువి నిర్మాణ సంస్థ అనుష్కను మళ్ళీ రెండవ సారి ‘భాగమతి 2’ ని తీయాలని యువి క్రియేషన్స్ నిర్ణయించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది.
మరొక పక్క చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభరలో’ స్వీటీ అనుష్క కు ఒక కీలక పాత్రలో నటించే అవకాశం కోసం యువీ సంస్థ చాల పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుష్కతో సినిమా ప్లాన్ చేయాలి అంటే ప్రస్తుతం నిర్మాతలకు అనేక సమస్యలు ఎదురౌవుతున్నాయి అని అంటున్నారు. అనుష్క ఫిజిక్ లో వచ్చిన మార్పులు వల్ల ఆమెను సినిమాలో లావుగా కనిపించకుండా చేయాలి అంటే కేవలం సీజీ వర్క్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితులలో ఎంతవరకు యువీ సంస్థ చిరంజీవి పక్కన ఆమెను ‘విశ్వంభర’ మూవీ కోసం ఎంపిక చేస్తుంది అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన నిర్ణయం ఇంకా తెలియకుండానే ఇప్పుడు ‘భాగమతి 2’ కు సంబంధించిన వార్తలు వస్తూ ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించే దర్శకుడు ఎవరు అన్న చర్చలు మొదలయ్యాయి. అయితే ‘భాగమతి’ విడుదలై 7 సంవత్సరాలు దాటిన నేపధ్యంలో ఈ మూవీకి సీక్వెల్ ను ఇప్పుడు తీస్తే ప్రేక్షకులు ఎంతవరకు పట్టించుకోగలరు అన్న సందేహాలు ఇండస్ట్రీలోని కొందరికి వస్తున్నాయి..