బాబీ స్కెచ్ కి షాక్ లో బాలకృష్ణ !

Seetha Sailaja
భగవంత్ కేసరి’ మొదరేట్ హిట్ గా మారడంతో ఎట్టకేలకు బాలకృష్ణ కు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హ్యాట్రిక్ విజయం సొంతం అయింది. దీనితో బాలయ్య ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న బాలకృష్ణ దర్శకుడు కె ఎస్. బాబీ ల సినిమాకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన ఒక ఆశక్తికర న్యూస్ ఇప్పుడు బాలయ్య అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.



ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ చాల డిఫరెంట్ గా ఉండే విధంగా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈసినిమాలోని బాలకృష్ణ పాత్రకు సంబంధించిన గెటప్ ను నాలుగు రకాలుగా డిజైన్ చేయించి బాలకృష్ణ వద్దకు దర్శకుడు బాబి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్కెచ్ లను చూసిన బాలయ్య షాక్ అవ్వాడమే కాకుండా బాబి ని పిలిపించి అతడిని అభినందించినట్లు తెలుస్తోంది.



అయితే ఈ గెటప్ కు సంబంధించిన డ్రెస్ ఘాట్ లో పాల్గొనడానికి తనకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాజాకీయాలకు సంబంధించిన కొన్ని కీలక వ్యవహారాలు చక్కపెడుతున్న పరిస్థితులలో తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన విషయాల కంటే ప్రస్తుతం బాలయ్య దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై బాగా ఉంది అంటున్నారు.



ఇది ఇలా ఉంటే ఈ మూవీలో బాలకృష్ణ పక్కన నటించే హీరోయిన్ గురించి అన్వేషణ మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. దర్శకుడు బాబి దృష్టిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈవిషయంలో కూడ బాలయ్య అభిప్రాయం గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని డిసెంబర్ లో మొదలుపెట్టి ఆరు నెలలలో పూర్తి చేయాలని బాబి భావిస్తున్నప్పటికీ వచ్చే సంవత్సరం ఏప్రియల్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ప్లాన్ అనుకున్నట్లుగా జరగక పోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: