నిరూపమ్.. సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనట?
ఇక అతను నటించిన చాలా సీరియల్స్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకులను అలరించాయ్. అయితే అటు ఇంతలా బులితెరపై హవా నడిపించిన నిరూపమ్ అటు వెండితెరపై మాత్రం ఎక్కడ సక్సెస్ కాలేకపోయాడు. ఇక అడపదప పాత్రలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాను సినిమాలో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాల్లో ఎందుకు పెద్దగా గుర్తింపు రాలేదు అని అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ కు జోడిగా నటించాడు నిరూపమ్.
అయితే సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో రెండు, మూడు సినిమాలు కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చాడట. కానీ నేను సీరియల్ లో నటిస్తాను అన్న విషయం తెలిసి నన్ను సినిమాల్లో రిజెక్ట్ చేశారు. ఆ సమయంలో ఏడుపు కూడా వచ్చింది. నాన్న ఫోటో ముందు తెగ ఏడ్చేశాను. తండ్రి లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించి నన్ను న్యూ కమ్మర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నాకు సినిమా సర్కిల్ లేదు. అందువల్లే సినిమా ఆఫర్స్ కోసం ఎక్కడికి వెళ్లలేదు అంటూ నిరూపమ్ తెలిపాడు. అప్పట్లో ఇది బాధగా అనిపించిన ఇప్పుడు బుల్లితెరపై మాత్రం హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇంకొన్ని సినిమాల్లో కనిపిస్తాను అంటూ నిరూపమ్ చెప్పుకొచ్చాడు