హాట్ టాపిక్ గా మారిన ఖుష్బూ వారసురాలు !
ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిన ఖుష్భూ తన హీరోయిన్ కెరియర్ ముగిసిపోయినప్పటికీ అనేక సినిమాలలో కేరెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాలలో కూడ తన సత్తా చాటాలని ఆమె ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు అవకాశాలు కలిసిరావడంలేదు. ఈ పరిస్థితుల మధ్య ఖుష్భూ చిన్న కూతురు ఆనందిత సుందర్ ఇప్పుడు హీరోయిన్ గా ఒక భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ ద్వారా ఫిలిమ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.
36 సంవత్సరాల విరామం తరువాత మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్ లో త్వరలో షూటింగ్ ప్రారంభం జరుపుకోబోతున్న భారీ మూవీ ప్రాజెక్ట్ లో ఆనందిత హీరోయిన్ గా ఎంపిక కావడం దక్షిణ భారత సినిమా రంగంలో షాకింగ్ న్యూస్ గా మారింది. విదేశాలలో ఉన్నత విద్య చదివిన ఆనందిత సినిమాల పట్ల తనకు ఉన్న ఆశక్తితో హీరోయిన్ కెరియర్ వైపు అడుగులు వేస్తోంది.
మహిళల సమస్యల పట్ల అదేవిధంగా మహిళా సాధికారిత విషయంలోను ఆనందిత కు తన తల్లి లానే కొన్ని అభ్యుదయ భావాలు ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలు జరపుకున్న ఈ మూవీలో ఆనందిత సుందర్ పాత్ర విషయంలో క్లారిటీ లేదు. అయితే దర్శకుడు మణిరత్నం తన హీరోయిన్స్ ను కేవలం గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు మాత్రమే కాకుండా తన సినిమాలలో నటించే హీరోయిన్ కు నటన పరంగా రాణించడానికి అవకాశాలు ఇచ్చే పాత్రలను క్రియేట్ చేయడం మణిరత్నం హాబీ..