వరుణ్ పెళ్లిలో శ్రీజ ఒక్కటే పాపం అలా....??

murali krishna
మెగా కుటుంబం మొత్తం ప్రస్తుతం వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలలో బిజీగా సంతోషంగా ఉన్నారు. నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.దాదాపు 6 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వీరి వివాహ వేడుకలు ఇటలీలో పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక హైదరాబాద్లో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కూడా ఆహ్వానించి ఘనంగా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు.ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరగడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా ఉపాసన మెగా ఫ్యామిలీ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ దంపతులు అల్లు అర్జున్ దంపతులు నాగబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి అందరూ కూడా వారి లైఫ్ పార్టనలతో కలిసి ఉన్నారు. ఇక ఈ ఫోటోలో శ్రీజ కూడా ఉండటం విశేషం.

ఇలా ఈ ఫ్యామిలీ ఫోటోలు శ్రీజ తన చిన్న కుమార్తెతో కలిసి ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఓకేచోట ఉన్నటువంటి ఈ ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెను మెగా ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు శ్రీజ పట్ల పలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ఫర్ఫెక్ట్ మెగా ఫ్యామిలీ కానీ శ్రీజ మాత్రమే తన లైఫ్ పార్ట్నర్ తో లేదని ఆమె మాత్రమే సింగిల్ గా ఉంది అంటూ శ్రీజ పట్ల కామెంట్స్ చేస్తున్నారు.  ఇక శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె కుటుంబ సభ్యులను ఎదిరించి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ వ్యక్తి నుంచి విడాకులు తీసుకొని బయటకు వచ్చేసారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి తన కూతురికి చిరంజీవి తన సమీప బంధువుల అబ్బాయితోనే రెండవ వివాహం చేశారు. ఇలా రెండో పెళ్లి చేసుకున్నటువంటి శ్రీజ తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.   ఇక ఈ దంపతులకు మరో కుమార్తె కూడా జన్మించింది అయితే శ్రీజకు మరో కుమార్తె జన్మించిన తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటినుంచి ఈమె తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఈమె హాజరై సందడి చేశారు తాజాగా ఉపాసన ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నెటిజన్స్ శ్రీజ పట్ల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: