అవన్నీ నిజం కాదు.. నమ్మకండి : మృనాల్
సీతారామం అనే ఒక క్లాసికల్ లవ్ స్టోరీ సినిమాతో మృనాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతలా దగ్గర అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు అందం అభినయానికి తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. సీతారామం సినిమా తర్వాత అటు టాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటుంది. మరికొన్ని రోజుల్లో నానీ హీరోగా తెరకెక్కిన హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల కాలంలో ఎక్కడి నుంచో వచ్చిన హీరోయిన్లు తెలుగు హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.
లావణ్య త్రిపాఠి ఇటీవలయం తెలుగు హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది. దీంతో ఇక అటు మృనాల్ ఠాగూర్ కూడా ఒక తెలుగు అబ్బాయిని వివాహం చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది. దీంతో మృనాల్ ఠాగూర్ పెళ్లి చేసుకోబోయే ఆ తెలుగు అబ్బాయి ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. అయితే ఇక ఇటీవల తన గురించి వస్తున్న వార్తలపై మృనాల్ ఠాగూర్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేసింది. ఆ వార్తను చూసి నా ఫ్రెండ్స్ బంధువులు ఫోన్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నారు. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఓ పని చేయండి. అబ్బాయిని మీరే వెతికి పెట్టండి. పెళ్లి వేడుక లోకేషన్ కూడా పెట్టండి.. ఓకేనా అంటూ చెప్పుకొచ్చింది మృనాల్ ఠాగూర్.