కీడా కోలా: కామెడీ ఒకే.. కథ ఏది?

Purushottham Vinay
పెళ్ళిచూపులు.. ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యువతలో చాలా మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. కొన్ని సినిమాల్లో నటుడిగా నటించి కూడా తన ప్రత్యేకతను చాటుకున్న తరుణ్.. ఇక కొంచెం గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా 'కీడా కోలా'. ఈ సినిమాలో అతను ఓ కీలక పాత్ర కూడా చేశాడు. క్రేజీ ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను 'కీడా కోలా' సినిమా ఎంతవరకు అందుకుందో తెలుసుకుందాం.రెండు గంటల నిడివి ఉన్న 'కీడా కోలా'లో గంటన్నర సమయం చాలా ఈజీగానే సాగిపోతుంది. ఏ సీనుకి ఆ సీన్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కానీ వీటన్నింటినీ కలిపి ఒక సినిమాగా చూస్తే మాత్రం 'కీడా కోలా' లో పెద్ద స్టోరీ ఏమి కనిపించదు.  కథలో అస్సలు బలం లేదు.  కోట్లు సంపాదించడం ఇంత ఈజీనా అన్నట్లుగా ఉంటాయి ఈ సినిమాలోని సీన్లు.ఈ సినిమాలో  ఎమోషన్ పెద్దగా కనిపించదు.



ఇక కథను మొదలుపెట్టిన తీరు అంత ఆసక్తికరంగా అనిపించదు. మొత్తంగా ఈ సినిమాని పార్టులు పార్టులుగా చూస్తే బాగుంటుంది కానీ టోటల్ సినిమాగా చూస్తే అస్సలు నచ్చదు. కామెడీ పర్వాలేదు. అయితే బ్రహ్మానందం ని సరిగ్గా వాడుకోలేదు తరుణ్ భాస్కర్. ఏదో ఆయన్ని ఇరికించారు. అంతే తప్ప ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది అస్సలు ఉండదు. వివేక్ సాగర్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. కానీ పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది లాంటి సినిమాల తరహాలో ఈ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు తరుణ్ భాస్కర్.ఇక ఓపెన్ మైండ్ తో ఒక క్రైమ్ కామెడీ సినిమాలా చూస్తే 'కీడా కోలా' ఓకే అనిపిస్తుంది కానీ.. పెళ్ళిచూపులు.. ఈ నగరానికి ఏమైంది సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాని వాటి రేంజ్ లో తీయలేదు. మొత్తానికి అంచనాలను మాత్రం 'కీడా కోలా' అందుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: