అనుష్కకు ఉన్న ఈ అలవాటు.. ప్రభాస్ కు అస్సలు నచ్చదట తెలుసా?
మిర్చి, బాహుబలి సినిమాలతో సందడి చేసి సూపర్ సక్సెస్ జోడీగా కూడా పేరు సంపాదించుకున్నారు అనుష్క, ప్రభాస్. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ ని చూసి వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అంటూ ప్రేక్షకులు కూడా అనుకోవడం మొదలుపెట్టారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా ఎన్నోసార్లు తెరమీదికి వచ్చాయి అని చెప్పాలి. అయితే మేమిద్దరం కేవలం మంచి స్నేహితుల మాత్రమే మా మధ్య ఏమీ లేదు అంటూ ఒకవైపు అనుష్క మరోవైపు ప్రభాస్ ఇద్దరు కూడా ఇక ప్రేమ అనే వార్తలను ఖండించారు. అయితే ఇప్పుడు ఇద్దరికీ సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
అనుష్కకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ప్రభాస్ కి అస్సలు నచ్చదట. ఎన్నోసార్లు అలవాటును మార్చుకోవాలని కూడా ప్రభాస్ అనుష్కకు సూచించాడట. అయినప్పటికీ అనుష్క మాత్రం మానుకోలేదట. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా గోర్లు కొరికే అలవాటు. టెన్షన్ ప్రెషర్ కంగారుగా ఉంటే అనుష్క కచ్చితంగా గోర్లు కొరుకుతుందట. అయితే ప్రభాస్ కి మాత్రం ఈ అలవాటు అస్సలు నచ్చదట. మానుకోవాలని ఎన్నో సార్లు చెప్పాడట. కానీ అనుష్క మాత్రం ఈ అలవాటు మానుకోలేక పోయిందట. దీంతో ప్రభాస్ కూడా ఈ అలవాటు మానుకొని చెప్పడం మానేశాడట.