బిగ్ బాస్ హౌస్ కి శివాజీ విలన్.. మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్?
అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కి నిర్వాహకులు ఇచ్చే టాస్కులు కూడా పాత చింతకాయ పచ్చడిలా కాకుండా కాస్త కొత్తగా ఉన్నాయ్ అని చెప్పాలి. దీంతో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ ని ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఇక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీజన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ సీజన్ సెవెన్ పై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న మానస్ సీజన్ సెవెన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శివాజీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి సీజన్లో శివాజీ లాంటి ఒక విలన్ ఉంటాడు. కానీ హీరో ఎవరనేది మాత్రం ఆడియన్స్ చేతి లోనే ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మానస్. శివాజీ కేవలం ఇద్దరికీ మాత్రమే ఫేవర్ గా ఉంటున్నాడు. అందుకే మిగిలిన కంటెస్టెంట్ల ఆటను చెడగొట్టాలని చూస్తున్నాడు. నేను ఇప్పటి వరకు చాలా రకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్ను మాత్రం ఇప్పటివరకు చూడలేదు అంటూ మానస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.