"జపాన్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి కార్తీ ఆఖరుగా సర్దార్ అనే "స్పై" యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించిన కార్తీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే సర్దార్ లాంటి సూపర్ సక్సెస్ తరువాత కార్తీ "జపాన్" అనే సినిమాలో హీరోగా నటించాడు.


ఈ మూవీ ని నవంబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో అను ఇమన్యుయల్ హీరోయిన్ గా నటించగా ... రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఇదే తేదీన తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు రాత్రి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.
 


ఈ మూవీ తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: