క్యూరియాసిటీ పెంచేస్తున్న రక్షిత్ అట్లూరి నరకాసుర రిలీజ్ డేట్ లాక్..!

Divya
పలాస మూవీ డైరెక్టర్ రక్షిత్ అట్లూరి హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం నరకాసుర.. ఇందులో అపర్ణ జనార్ధన్ , సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్లపై డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం .ఇకపోతే ఈ సినిమాను సెభాష్టియన్ నోవా అకోస్ట జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది ఈ సినిమా.

 దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నవంబర్ 3వ తేదీన ఉషా పిక్చర్స్ ద్వారా నరకాసుర చిత్రాన్ని థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల చేయడానికి సన్న హాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం పాల్గొని దర్శకుడు సెబాష్టియన్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో అన్నీ కూడా ఆగిపోయినప్పుడు మా నిర్మాతలు రఘు , శ్రీనివాస్ నన్ను పిలిచి ఈ చిత్రానికి దర్శకత్వం వహించమని తెలిపారు.  ఇక నరకాసుర సినిమా కోసం మా టీమ్ మొత్తం రెండు సంవత్సరాల పాటు కష్టపడింది.

గత నెలలో మొదటి కాపీ సిద్ధమయ్యింది. ఇక ప్రేక్షకులు సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ కూడా మొదలయింది.  కానీ విడుదల కోసం చూస్తున్నప్పుడు కొంతమంది మాకు మద్దతు ఇవ్వగా మరికొంతమంది నిరాశపరిచారు . కానీ రెండు వేలకు పైగా చిత్రాలను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా చిత్రాన్ని నవంబర్ 3వ తేదీన విడుదల చేస్తూ ఉండడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్టుగా నిలవడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. రక్షిత్ నాన్న.. నన్ను ఒక కొడుకు లాగా చూసుకున్నారు. కచ్చితంగా నరకాసుర సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అంటూ డైరెక్టర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: