ప్రకాష్ ను టార్గెట్ చేస్తున్న రవితేజ అభిమానులు !

Seetha Sailaja
ప్రస్తుతం స్టార్ హీరో  సినిమాకు కధ ఎంచుకోవడం ఎంత ముఖ్యంగా మారిందో ఆసినిమాకు సరైన సంగీత దర్శకుడిని ఎంచుకోవడం మరింత  సమస్యగా మారింది. సంగీత దర్శకుడి ఎంపికలో ఏమాత్రం పొరపాటు   జరిగినా ఆ ఎఫెక్ట్  స్టార్  హీరో నటించిన సినిమా విజయం పై తీవ్ర  ప్రభావాన్ని చూపిస్తుంది.    



అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే ‘జైలర్’ ‘విక్రమ్’ సినిమాలు బ్లాక్ బస్టర్  అయిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలకు సంబంధించి తమన్ దేవిశ్రీ ప్రసాద్ ల హవా నెమ్మదిగా  తగ్గుతూ ఉండటంతో ఈమధ్య తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకోవడం బాగా ఎక్కువ అయింది ఆలిస్ట్ లో జివి ప్రకాష్ ఒకడు. వాస్తవానికి ఈ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాలకు కొత్త కాదు.    



ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలకు  మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. అనేక డబ్బింగ్ సినిమాలకు కూడ ఇతడు   సంగీత దర్శకుడిగా  వ్యవహరించాడు. ఆనమ్మకంతోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ లాంటి పెద్ద సినిమాకు ఇతడిని సంగీత దర్శకుడిగా  ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాకు  దర్శకత్వం వహించిన కొత్త  దర్శకుడు వంశీ ఫెయిల్ అయ్యాడో లేక మంచి బిజిఎం ఇవ్వడంలో  ప్రకాష్ తడబడ్డాడో తెలియదు కానీ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు   ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడ ఒక కారణం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  



ఎంతో టాలెంట్ ఉన్న సంగీత  దర్శకుడు  ప్రకాష్ ఇలాంటి మ్యూజిక్  స్కోర్ ఈ సినిమాకు ఎందుకు ఇచ్చాడు అన్నది రవితేజా  అభిమానులకు కూడా అర్ధంకాని విషయంగా మారింది. ప్రస్తుతం సంగీత  దర్శకుడు ప్రకాష్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ ‘వైష్ణవ్ తేజ్ ఆదికేశవ’ విక్రమ్ తంగలాన్ కంగనా ‘రౌనత్ ఎమెర్జెన్సీ’ ‘కార్తీ జపాన్ లాంటి భారీ సినిమాలు చాలా ఉన్నాయి.ఈపరిస్థితుల నేపధ్యంలో  ఈ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: