అంతా తూచ్.. వరుణ్ - లావణ్య పెళ్లి డేట్ మారిపోయిందిగా?

praveen
గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటే. అదే మెగా ఫ్యామిలీలో మోగబోతున్న పెళ్లి భాజల గురించి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెద్దలను ఒపించి ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. నవంబర్ ఒకటవ తేదీన ఇక మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయని అందరూ ఫిక్స్ అయిపోయారు.


 ఇటలీలోని టస్కానియాలో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు అంటూ ఒక వార్తా గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీని ఊపేస్తుంది. అయితే ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ మాత్రం ఎన్నడు స్పందించలేదు. అయితే ఇప్పుడు పెళ్లి డేట్ వాయిదా పడింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇటీవల లావణ్య త్రిపాఠి బ్యాచిలర్స్ గర్ల్స్ పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పెళ్లి డేట్ ను అలాగే పెళ్లి జరిగే ప్రదేశాన్ని కూడా రివిల్  చేసింది. తన ఫోటోలను షేర్ చేస్తూ తన నెక్స్ట్ స్టాప్ రోమ్ అంటూ తెలిపింది.


 ఇలా ఈ ఇద్దరినీ కలిపిన ఇటలీలోనే వీళ్ళు అఫీషియల్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు వీళ్ల పెళ్లి నవంబర్ ఒకటవ తేదీన జరగట్లేదు. అక్టోబర్ 31వ తేదీనే పెళ్లి జరుగుతుంది. అంటే ఒక్కరోజు ముందుగానే ఇక మెగా ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని చెప్పాలి  అయితే మంగళవారం మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చే రోజు. అందుకే ఇలా అక్టోబర్ 31వ తేదీన మంగళవారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట  ఇక ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన కూతురు క్లిన్ కార కూడా ఇటలీ చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: