జబర్దస్త్ కి అనసూయ రీ ఎంట్రీ.. ఇది నిజమేనా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ కి తెలుగు బుల్లితెరపై ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కేవలం ఒక షో అనడం కంటే ఇదొక సెన్సేషన్ అనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెరపై మునుపెన్నడు ఎవ్వరూ చూడని రేటింగ్స్ ని సాధించింది ఈ షో. అయితే ఈ షోని బీట్ చేయడానికి ఎన్నో కామెడీ షోస్ పోటీగా వచ్చిన.. ఏవీ కూడా నిలవలేకపోయాయి అని చెప్పాలి. ఇక ఎంతోమంది అప్కమింగ్ కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. ఇక ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారు సినిమాల్లో కూడా బిజీగా మారారు.


 ఎంతోమంది జబర్దస్త్ లోకి వస్తున్నారు. ఇక పోయే వాళ్ళు పోతున్నారు. కానీ జబర్దస్త్ బ్రాండ్ వాల్యూ మాత్రం ఎక్కడ మారడం లేదు. అయితే గతంలో జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన అనసూయ సైతం ఇలా ఈ షో నుంచి తప్పుకుంది. సినిమాల్లో అవకాశాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చివరికి తన కెరియర్ పై దృష్టి పెట్టడానికి జబర్దస్త్ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. అయితే ఇప్పుడు అనసూయ మళ్లీ జబర్దస్త్ షోకి యాంకర్ గా రాబోతుందా అంటే మాత్రం ఆమె ఇటీవలే పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత అందరూ అవును అని సమాధానం చెబుతున్నారు.



 ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగానే ఉంది అనసూయ. అయితే మళ్లీ టీవీ షో కి రాబోతున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది. తిరిగి యాంకరింగ్ చేయాలంటే మీరు ఏ షో సజెస్ట్ చేస్తారని మూడు ఆప్షన్స్ ఇచ్చింది అనసూయ. జబర్దస్త్, డ్రామా జూనియర్స్, మా మహాలక్ష్మి అంటూ మూడు ఆప్షన్స్ ఇవ్వగ.. ఇక నేటిజన్స్ అందరు ఏకగ్రీవంగా జబర్దస్త్ షోకే ఓటేశారు. దీంతో అనసూయ మళ్లీ జబర్దస్త్కు వస్తే బాగుండు అని కోరుకుంటున్నా అభిమానులు చాలామంది ఉన్నారని అర్థమైంది. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే అనసూయ జబర్దస్త్ కి వస్తుందా లేదంటే మరో షోలో యాంకర్ గా ప్రత్యక్షమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: