బలగం వేణు నెక్స్ట్ మూవీ ఆ హీరోతో కాదట... అసలు విషయం ఏంటో తెలుసా..?

frame బలగం వేణు నెక్స్ట్ మూవీ ఆ హీరోతో కాదట... అసలు విషయం ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన వేణు ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ స్కిట్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో ఈయనకు జబర్దస్త్ వేణు గా మంచి గుర్తింపు లభించింది.


ఇక అలా చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ లో కంటిన్యూ అయినా వేణు కొంత కాలం క్రితమే ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా బలగం అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా ఇలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇక బలగం మూవీ తో దర్శకుడిగా వేణు కు సూపర్ క్రేజ్ లభించింది. దానితో బలగం లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడు అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగిపోయింది. దానితో వేణు తాజాగా ఓ కథను రాసుకున్నట్లు దానిని హీరో వెంకటేష్ కు వినిపించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.


ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వేణు ... వెంకీ కాంబోలో మూవీ రూపొందబోతుంది అని వచ్చిన ఈ వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తుంది. ప్రస్తుతం వేణు కథను తయారు చేసే పనిలో ఉన్నట్లు అది ఒక యంగ్ హీరో కోసం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వేణు తదుపరి మూవీ ని దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: