విజయ్, బాలయ్య, రవితేజ: దసరా విన్నర్ ఎవరంటే?

Purushottham Vinay
తమిళ స్టార్ స్టార్ హీరో తలపతి విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో 'మాస్టర్' సినిమా తర్వాత వచ్చిన మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ 'లియో'. అక్టోబర్ 19 న దసరా కానుకగా ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ అయ్యింది.అయితే మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.దానికి కారణం ఆడియన్స్ అంచనాలని అందుకోకపోవడం.విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. అందువల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగులో మొదటి రోజు రూ.8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. అయితే  ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్ అయ్యింది. మరోపక్క పాజిటివ్ టాక్ వల్ల ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాగా హోల్డ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ‘లియో’ రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనే ఆసక్తి అందరిలో కూడా పెరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగులో రెండో రోజు కూడా లియో సినిమా స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది.తెలుగులో లియో రెండో రోజు రూ.3.5 కోట్ల దాకా షేర్ ని కలెక్ట్ చేసిందని సమాచారం తెలుస్తుంది. దీంతో రెండు రోజుల్లో ‘లియో’ రూ.12 కోట్ల వరకు షేర్ వచ్చిందని సమాచారం.ఇప్పటికే 50% రికవరీ అయ్యిందని సమాచారం.


సోమవారం నాటికి ఈ మూవీ తెలుగులో  బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేట్టు సూచనలు కనిపిస్తున్నాయి.కానీ తమిళనాడులో ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు. తెలుగులో ఎంత లాభం వస్తుందో తమిళనాడులో అంతకు డబుల్ నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.ఇక అలాగే మాస్ మహారాజ్ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమా కూడా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది. దాదాపు 20 కోట్ల దాకా ఓపెనింగ్స్ నమోదు చేసిందని సమాచారం.ఈ సినిమాలో రవి తేజ యాక్టింగ్ సూపర్ కానీ అనవసరపు లవ్ ట్రాక్, ల్యాగ్ ఇంకా మ్యూజిక్ కారణంగా ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా లేవు. మొత్తానికి తెలుగులో దసరా విన్నర్ ఎవరంటే డౌట్ లేకుండా బాలయ్య అనే చెప్పాలి. భగవంత్ కేసరి స్లో గా స్టార్ట్ అయినా మెల్లగా పుంజుకుంటుంది. మౌత్ టాక్ బాగుండటం వల్ల ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా వస్తున్నారు.రెండు రోజుల్లో ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం.ఈ వసూళ్లు పెరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: