ఆ పాయింట్ విషయంలో అనిల్ రావిపూడి ఫెయిల్ అయ్యడా ?

Seetha Sailaja
ఒక మంచి పాయింట్ ను ఎంచుకున్నప్పటికి ఆపాయింట్ ను కధగా  చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయితే నటీనటులు ఎంత కష్టపడి నటించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాదు అన్న విషయానికి ఉదాహరణగా ‘భగవంత్ కేసరి’ మిగిలిపోతుందా అన్న  సందేహాలు ఇండస్ట్రిలోని కొందరికి కలుగుతున్నాయి.


రోజురోజుకి సమాజంలో అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలను ఆధారంగా చేసుకుని అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమా తీసినప్పటికి ఆ సినిమా ఊహించిన స్థాయిలో   విజయవంతం కాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.    చట్టంలోని లొసుగులను వాడుకుని నిందితులు నిర్భయంగా బయటికి వచ్చి ఎలా తిరుగుతున్నారు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా స్త్రీల పై జరుగుతున్న అఘాయిత్యాల చుట్టూ అల్లిన ఈ కధలో పాయింట్ బాగున్నప్పటికి ఈ మూవీ ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం ఈ మూవీ బయ్యర్లకు టెన్షన్ పెడుతున్నట్లు టాక్.


 ఈ  మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో బాలయ్య ఒక స్కూల్ కు వెళ్ళి అమ్మాయిలు చిన్నతనం నుంచే తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులకు ఎలా స్పందించాలి తమ తల్లికి ఎలా చెప్పాలి అన్న విషయామ్ పై మనసుకు హత్తుకునే లా డైలాగ్స్ చెప్పినప్పటికీ ఆ సినిమాను చూస్తున్న సగటు ప్రేక్షకులలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది అని అంటున్నారు.


ఈ దసరా రేస్ కు విడుదలైన ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాలకు కూడ టాక్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈమూడు సినిమాలలో సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న ‘భగవంత్ కేసరి’ కలక్షన్స్ విషయంలో నెమ్మదిగా పుంజుకుంటుందని ఈమూవీ నిర్మాతలు బయ్యర్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఈ దసరా రేస్ కు వచ్చిన మూడు సినిమాల్లో ఏసినిమాకు సూపర్ హిట్ టాక్ రాకపోవడంతో ఈ మూడు సినిమాల బయ్యర్ల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: