ఆమె వల్లే నిత్యమీనన్ పెళ్లి చేసుకోలేదా..!!
ఎన్నో వెబ్ సిరీస్లలో నటించిన పర్వాలేదు అనిపించుకున్న నిత్యామీనన్ ఇటివలె కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సందర్భంగా నిత్యామీనన్ తన ఆనందాన్ని తెలియజేస్తూ తన లైఫ్ కి చాలా దగ్గరగా అనిపించే కథ 30 ఏళ్లు దాటిన వివాహం చేసుకోకుండా లక్ష్యం అంటూ తిరిగే పాత్ర పోషించాను ఇది తన నిజ జీవితంలో కూడా జరిగిందని అందుకే ఈ కథను తనకు బాగా కనెక్ట్ అయిందని తెలిపింది. ఈ పాత్రలో నటించడం సులభమైనది నేను కూడా శ్రీమతి టైపే ఈ సిరీస్లో తన తల్లి పాత్ర పోషించిన గౌతమి గారు తన తల్లి లాగే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేవారు..
నిజజీవితంలో కూడా తన తల్లి బ్రతికున్నంత కాలం ఇలా బ్రతిమలాడుతూ వివాహం చేసుకోమనేది ప్రశాంతంగా పెళ్లి చేసుకుని నీకెందుకు ఈ సినిమాలు అంటూ చాలా ఇబ్బంది పెట్టేదట..ఈ పాత్ర చేస్తున్నప్పుడు గౌతమి గారిలో తన తల్లిని చూసుకున్నారని అందుకే గౌతమి గారిని చూస్తుంటే తన తల్లి గుర్తుకు వస్తోందని తెలుపుతోంది నిత్యామీనన్. తన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తనని చాలా బాధపెట్టాయని మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి చెడు ఎవరు చెప్పినా వదిలేయాలి అనే విషయాలను నేర్చుకున్నానని తెలిపింది. అందుకే ఇప్పటికి కూడా ఇంకా వివాహం గురించి ఆలోచించలేదని తెలిపింది నిత్యామీనన్.