రేణు దేశాయి క్లారిటీ వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయి వేరుగా ఉంటునప్పటికి  చాలామంది పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇప్పటికీ వదిన అంటూ అభిమానం తో పిలుచుకుంటూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఆమె అమెరికాకు చెందిన  ఒక వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకోవ‌డం ఆ వ్య‌క్తి ఫొటో బ‌య‌ట‌పెట్ట‌కుండా ఈవిష‌యం మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.


అయితే ఆతరువాత రేణు సైలెంటుగా పెళ్లి చేసుకుందా అన్న  విషయం  పై పవన్ అభిమానులకు క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో రేణు అప్పట్లో అనుకున్న తన దేశాయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కుముందు నిశ్చితార్థం చేసుకున్న వ్య‌క్తితో తన పెళ్లిని ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలియచేసింది.


త‌న‌కు రెండో పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న ముందు నుంచి ఉంద‌ని ఇప్ప‌టికీ ఉంద‌ని చెపుతూ తాను గతంలో పెళ్ళి చేసుకోవాలి అని భావించినప్పుడు తన కూతురు ఆద్య వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే అని తన కూతురు కోసం తన రెండవ పెళ్లి ఆలోచన వాడులుకున్నాను అని అంటోంది. అయితే ఆద్య‌ కు స‌రైన వ‌య‌సు వ‌చ్చి ఆమె సెటిల్ అయిన తరువాత తాను మళ్ళీ పెళ్ళి ఆలోచనలు చేసే అవకాశం ఉందని చెపుతూ రేపు ఏమి జరుగుతుందో తెలియని చాలామంది సెలిబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి గాసిప్పులు ప్రచారంలోకి తీసుకు వస్తూ రోజులు ఎందుకు గడుపుతారో తనకు కూడ అర్థం కాదు అంటూ కామెంట్స్ చేసింది.  


లేటెస్ట్ గా విడుదల అయిన రవితేజా ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో రేణు చాల సహజంగా నటించడమే కాకుండా ప్రముఖ సంఘసేవిక హేమలతా లవణం పాత్రను రేణు చాల సమర్థవంతంగా పోషించింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈసినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రేణు దేశాయ్ కి ఆమె కోరుకునే స్థాయిలో మంచి పాత్రలు మన దర్శకులు ఎంతవరకు ఆఫర్ చేస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: