బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన అలనాటి హీరోయిన్స్లో కరీనాకపూర్ కూడా ఒకరు. ఎన్నో రొమాంటిక్ కామెడీ క్రైమ్ సినిమాలలో నటించి అందం అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా పేరు సంపాదించింది. సౌత్ లో కూడా ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కరీనాకపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక నటుడే
కరీనాకపూర్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నది.. ఇప్పుడిప్పుడే రియంట్రీ ఇస్తూ పలు అవకాశాలను అందుకుంటోంది.ఇటీవలే లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ వయసులో కూడా తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తూ ఉంటుంది కరీనాకపూర్.. తాజాగా ఈమె ఒక కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ సరికొత్త కారు ల్యాండ్ రోవర్ డిఫరెంట్ కారును కొన్నట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కరీనాతో పాటు ఆమె సోదరీ కరిష్మా కపూర్ సైతం ఇందులో కనిపించడం గమనార్హం కొన్ని నివేదికల తెలిపిన ప్రకారం ఈ సినిమా రెండు నుండి రెండున్నర కోటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సెలబ్రిటీలలో ఈ ల్యాండ్ రోవర్ కార్ సన్నీ డియోల్ సునీల్ శెట్టి వద్ద మాత్రమే ఉన్నది. ప్రస్తుతం బంకింగ్ హామ్ మర్డర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది ఇప్పటికే ఈమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే సింగం-3 లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.