సీతారామం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకు తెలుగు
ఆడియన్స్ అందరూ
ఫిదా అయ్యారు. ఈ ఒక్క సినిమాతోనే స్టార్
హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం
టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ
బ్యూటీ తెలుగులో
నాని హీరోగా నటిస్తున్న హాయ్
నాన్న సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ
సినిమా విడుదల కాకముందే
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న
విజయ్ దేవరకొండ తో కలిసి మరొక
సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని పరశురామ
డైరెక్టర్ చేస్తున్నారు. అయితే ఇలా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కెరీర్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ఒకే భాషలో సినిమాలు చేస్తూ అదే చట్రంలో ఇరుక్కోవాలి అని నాకు అస్సలు లేదు.
అన్ని రకాల పాత్రలో నటించాలి అన్నది నా కోరిక. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలో నటించడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు. అందుకే అందుకే నేనెప్పుడూ నా దగ్గరికి వచ్చిన అన్ని భాషల సినిమాల కథలను వింటాను. నాకు నచ్చితే అన్ని భాషల కథలకు ఒప్పుకుంటాను. అందుకే అన్ని భాషల్లో సినిమాలను చేయడానికి నేను ఇష్టపడతాను అంటూ తన మనసులోనే విషయాన్ని బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ప్రేక్షకులు సైతం నా నుండి ఇదే కోరుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!