దసరా విజేత పై పెరిగిపోతున్న ఆశక్తి !
రేపు ‘భగవంత్ కేసరి’ ‘లియో’ లు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. బాలయ్య మరోసారి మాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈ మూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలు ఇంకా విడుదల కాకుండానే ఎవరు ఊహించని విధంగా ‘లియో’ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూసి ఇండస్ట్రి వర్గాలు షాక్ ఇస్తున్నాయి.
హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే కాకుండా బిసి సెంటర్లలో కూడ ఈ మూవీ మ్యానియా అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ల దగ్గర కనిపిస్తోంది. ఈసినిమాకు సంబంధించి మొదటిరోజు ఉదయం 7 గంటలకు షోలు వేస్తున్నా గంటల వ్యవధిలో సోల్డ్ అవుట్ బోర్డులను చూసి ఇండస్ట్రి వర్గాలు షాక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ ఎడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ రెండు కోట్లకు పైగా జరిగింది అన్న వార్తలు విని ఒక డబ్బింగ్ సినిమాకు ఇంత పిచ్చి మ్యానియానా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమాలు విడుదలైన మరునాడు రవితేజా ‘టైగర్ నాగేశ్వరావు’ గా రాబోతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు విశాల హృదయంతో డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలను కోరుకుంటున్న పరిస్థితులలో ఇన్ని సినిమాలలో ఏ సినిమాను విజేతగా నిలబెడతారు అన్న విషయం ఇండస్ట్రీలో సీనియర్స్ కు కూడ అర్థం కావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి..