ఆ క్రేజీ డైరెక్టర్ కి.. మరో ఛాన్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
సాధారణంగా ఎంతో మంది హీరో పాత్రలకే పరిమితమై కమర్షియల్ సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కానీ విజయ్ సేతుపతి అలా కాదు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలకపాత్రలో నటించే అవకాశం వస్తే నేను హీరోని.. అది కూడా స్టార్ హీరోని.. అలాంటి పాత్ర చేయడం ఏంటి అని అనుకోకుండా.. పాత్రలో వైవిద్యం ఉంది అంటే చాలు నిర్మొహమాటంగా ఓకే చెప్పేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ, హిందీలో భాషల్లో నటిస్తూ ఇప్పటివరకు 50 చిత్రాలకు పైగానే నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.
ఇకపోతే విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన పిశాచి 2 సినిమాలను విజయ్ లీడ్ రోల్ లో నటించాడు. అయితే ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే మీస్కిన్ టేకింగ్ నచ్చిన విజయ్ సేతుపతి ఇక మరో సినిమా కోసం ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావడమే కాదు షూటింగ్ కూడా మొదలు కాబోతుందట.