దీపావళి ని టార్గెట్ చేస్తున్న దీపావళి !

Seetha Sailaja
దసరా రేస్ విజేత పై ఇంకా స్పష్టత రాకుండానే దీపావళి సినిమాలు క్యూ కడుతున్నాయి. బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ దీపావళికి విడుదల అవుతున్న పరిస్థితులలో సల్మాన్ మ్యానియా ముందు తట్టుకోలేక మరొక సినిమా విడుదల చేయడానికి ఎవరు సాహసించడం లేడు అన్న వార్తలు వచ్చాయి.

అయితే ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రముఖ నిర్మాత  స్రవంతి రవికిషోర్ తమిళంలో తీసిన ‘కిద’ మూవీని తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు, వాస్తవానికి ఈమూవీకి విమర్శకుల నుండి ప్రశంసలు రావడమే కాకుండా ఈమూవీకి అనేక అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ కూడ వచ్చాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈమూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈమూవీ ఇంకా విడుదల కాకుండానే గత 6 నెలలుగా ప్రపంచ వ్యాపఠాయంగా జరిగిన అనేక ప్రముఖ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ఇప్పటికే అనేక అవార్డులు పోందింది. ఈ మూవీ ఆస్ట్రేలియ అలాగే భారత లో జరిగిన గోవా ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో కూడ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. ఆర్ ఏ వెంకట అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈమూవీ తాత మనవళ్ళ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు.

గతంలో ఎన్నో మంచి సినిమాలను తీసి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న స్రవంతి రవి కిషోర్ ప్రస్తుతం మారిన పరీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీయడంలో వెనకడుగు వేస్తున్నాడు. ఈమధ్య కాలంలో రిలీజ్ అవుతున్న కొన్ని చిన్న సినిమాలు ఊహించని ఘన విజయం సాధిస్తున్న పరిస్థితులలో ఈ దీపావళికి విడుదల ఈ దీపావళి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. గతంలో రామ్ కు హిట్ ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ మంచి అభిరుచి గల నిర్మాత చేస్తున్న ఈ చిన్న సినిమా ప్రయోగం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: