ఎవరికి సాధ్యం కానీ దాన్ని సాధించబోతున్న బాలయ్య బాబు....!!

murali krishna
నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీ లో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాల ను ఈ మధ్య కాలం లో అందుకుంటూ ఉన్నాయి.ఎన్నో సంవత్సరాలు టాప్ హీరో గా కొనసాగిన బాలయ్య ఇలాంటి క్రమం లోనే ప్రతి సినిమా ని కూడా విజయాన్ని అందు కుంటూ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో భగవంత్ కేసరి సినిమా లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా కి రిలీజ్ కాబోతోంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి పాజిటివ్ వైబ్స్ వినపడుతూ ఉన్నాయి.. ఈ సినిమా ట్రైలర్ను చూసిన చాలా మంది ప్రేక్షకులు సైతం ఇందు లో బాలయ్య ఒక సరికొత్త క్యారెక్టర్ తో కనిపించబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు కూడా ఈ సినిమా తో కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు అభిమానులు హ్యాట్రిక్ హిట్ బాలయ్య అంటూ తెలుపుతున్నారు. బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి తర్వాత ఈ సినిమా తోనే సక్సెస్ కొట్టి ఇండస్ట్రీ లో ఇప్పుడు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటున్న సీనియర్ హీరో గా గుర్తింపు పొందబోతున్నారు.

 ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం లో నటించబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఒకవేళ విజయం సాధిస్తే బాలయ్య కి ఇక ఇండస్ట్రీ లో తిరుగు ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వయసు లో కూడా బాలయ్య వరుస సినిమా లతో దూసుకుపోతూ ఉండడమే కాకుండా తనకు తగ్గ పాత్రల లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తూ బిజీ గా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలతో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: