చిరంజీవి సెటైర్ల వెనుక ఆంతర్యం !
ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా చిరంజీవి కామెంట్స్ పై చర్చలు జరుగుతున్నాయి. జర్నలిస్టుల జీవితాల పై ఒక ప్రముఖ జర్నలిస్ట్ వ్రాసిన పుస్తకాన్ని ఈమధ్య చిరంజీవి ఆవిష్కరిస్తూ సినిమాల గురించి ముఖ్యంగా హీరోయిజమ్ గురించి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ఇంత వయసు పెరిగిపోయాక ఒళ్ళు హూనం చేసుకుని డాన్సులు ఫైట్లు కాకుండా ఊరికే అలా నడుచుకుంటూ వచ్చి వెళ్తూ డైలాగ్స్ చెబితే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ తో ఎలివేట్ చేస్తే అది ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది అంటూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి.
చిరంజీవి ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఆతడు అన్న మాటలు రజినీకాంత్ ‘జైలర్’ గురించి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఆ మూవీకి చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజిక్ రజనీకాంత్ పెద్దగా కష్టపడి నటించకపోయినా ఆవిషయాన్ని కవర్ చేసింది అంటూ చిరంజీవి అభిప్రాయం అయి ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఆ సినిమా విషయానికి వస్తే కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాకుండా రజనీకాంత్ ఎప్పుడు కనిపించని విధంగా డిఫరెంట్ స్టైల్ లో నటించడం కూడ ఆ సినిమా ఘన విజయానికి సహకరించింది అన్న అభిప్రాయాలు కూడ చాలామందిలో ఉన్నాయి అన్న మాటలు వినిపించాయి. రొటీన్ సినిమాలు ప్రేక్షకులు చూడటం లేదు అన్న విషయాన్ని చిరంజీవి గ్రహించి ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో ఒక ఫ్యాంటసీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే..