క న్ఫ్యూజన్ లో ఉన్న ప్రభాస్ పుట్టినరోజు !
స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారి అభిమానులకు అది పండుగరోజు. ఆరోజున టాప్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో చేసే హడావిడి విపరీతంగా ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వీరాభిమానులు కలిగిన ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 ఆరోజు దసరా పండుగ కూడ కావడంతో ప్రభాస్ అభిమానులు చేయబోయే హడావిడితో సోషల్ మీడియా హోరెత్తి పోతుంది అన్నఅంచనాలు ఉన్నాయి.
ఆరోజున ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ కు సంబంధించిన ట్రైలర్ వచ్చి తీరుతుందని అతడి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈమూవీ ఫైనల్ ఎడిటింగ్ లో చాల బిజీగా ఉండటం వలన ఈమూవీ ట్రైలర్ విషయంలో శ్రద్ధ పెట్టలేక పోతున్నాడు అన్నలీకులు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మూడు రకాలుగా ఈమూవీ ట్రైలర్ ను డిజైన్ చేసినప్పటికీ ఏఒక్క ట్రైలర్ క్వాలిటీ ప్రశాంత్ నీల్ కు కూడ పూర్తిగా నచ్చలేదు అన్నప్రచారం జరుగుతోంది.
అక్టోబర్ 23 అంటే ఇక కేవలం కొన్నిరోజులు మాత్రమే ఉన్న పరిస్థితులలో ఈమూవీ ట్రైలర్ అనుకున్న సమయానికి వస్తుందా రాదా అన్న టెన్షన్ అభిమానులలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి’ మూవీకి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ప్రభాస్ పుట్టినరోజునాడు ఉండి తీరుతుందని అంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ‘సలార్’ మ్యానియాను తగ్గించే విధంగా తన సినిమాలకు సంబంధించి మరొక మూవీ ట్రైలర్ కానీ టీజర్ విడుదల వద్దని పూర్తిగా ‘సలార్’ మ్యానియా పైనే దృష్టి పెట్టమని ప్రభాస్ ప్రశాంత్ కు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం పూర్తిగా ‘సలార్’ మూవీకి సంబంధించిన ట్రైలర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సమయానికి ‘సలార్’ విడుదల ఇక కేవలం 60 రోజులు మాత్రమే ఉంతుంది కాబట్టి ఆరోజు నుండి ‘సలార్’ మ్యానియా తారా స్థాయిలో కొనసాగాలని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు..