మెగా కుటుంబంలో కోడళ్ళ మధ్య విభేదాలా..!!
కేవలం మామోలు కుటుంబంలోనే కాకుండా స్టార్ సెలబ్రెటీల కుటుంబాలలో కూడా ఇవి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు మెగా కుటుంబంలో మరి కొద్ది రోజుల్లో కొత్తగా కోడలుగా అడుగు పెట్టబోతోంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. అయితే ఈమె ఇంకా కోడలు అడుగు పెట్టకముందే.. రామ్ చరణ్ భార్య మెగా కోడలు ఉపాసన మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ ,డెకరేషన్ , గెస్ట్ ల ఇతరత్రా వాటిని కూడా ఎక్కువగా ఉపాసనని చూసుకుంటోందట.
అయితే అసలు విషయంలోకి వెళ్తే ఉపాసన సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ డిజైన్ లావణ్య త్రిపాటికి నచ్చలేదట. దీంతో నచ్చని పని ఎందుకు చేయడమని ఉపాసన మొహం మీదే చెప్పేసిందట లావణ్య త్రిపాఠి..అయితే లావణ్య అలా చెప్పడంతో ఉపాసన కూడా అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయిందని సమాచారం. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన పెళ్లిలో ఆమె పెత్తనం ఏంటి అంటూ తనకు నచ్చిందే చేస్తానని తన పెళ్లి విషయంలో తన మాటే నెగ్గాలని కూడా తన బాయ్ ఫ్రెండ్ వరుణ్ తేజ్ తో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరికి చెప్పలేక వరుణ్ తేజ్ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.