పవన్ కళ్యాణ్ తో.. అందుకే బోయపాటి సినిమా చేయట్లేదట?
ఇక ఆ తర్వాత ఏకంగా మాస్ ప్రేక్షకులలో కూడా ఊహించని రీతిలో గుర్తింపును సంపాదించుకుని ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే సాధారణంగా సినిమా హిట్ అయితేనే మంచి వసూళ్లు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా లాభాలు వస్తాయి అని నిర్మాతలు చెబుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోతో పని చేయాలని అటు దర్శక నిర్మాతలు కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి.
అయితే ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక తన దగ్గరికి కథలు పట్టుకొని వచ్చిన అందరు డైరెక్టర్లకు టైం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ సరిగ్గా డేట్స్ ఇవ్వడు కాబట్టి సినిమాలు చేయడానికి కూడా డైరెక్టర్లు భయపడిపోతున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు తీస్తారు అని ఒక యాంకర్ అడగగా.. నాతో సినిమా అంటే 40,50 రోజులు డేట్స్ చేస్తే సరిపోదు. అంత తక్కువ సమయంలో నేను సినిమాలు తీయలేను. ఏ హీరో అయినా నా సినిమాకి 150 రోజులు డేట్స్ కేటాయించాల్సిందే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా అలాగే కేటాయిస్తే నేను కచ్చితంగా సినిమా చేస్తాను అంటూ బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు.