లియో ప్రొడక్షన్ హౌస్ తో.. చరణ్ క్రేజీ ప్రాజెక్ట్?

praveen
మెగాస్టార్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిశ్రమమైన రామ్ చరణ్ తేజ్  ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా కాదు తండ్రికి మించిన తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా తన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత చరణ్ చేసే ప్రతి ప్రాజెక్టుపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. వైవిద్యమైన దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తూ ఉన్నాడు రామ్ చరణ్.


 ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా కొనసాగుతున్న లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లియో సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీని ఊపేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇది నిజమే అన్న క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాంచరణ్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 లోకేష్ కనకరాజు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న  లియో సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే ఇక లియో సినిమాను నిర్మిస్తున్న సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ తో రామ్ చరణ్ టచ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లో ఒక క్రేజీ సినిమా చేసేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడని.. ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది అని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: