జపాన్ మూవీ టీజర్ డేట్ లాక్..!!

Divya
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటాడు హీరో కార్తీ.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు. ఇటీవలే తను నటిస్తున్న తాజా చిత్రం జపాన్.. ఈ సినిమాని డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కాగ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడేలా చేశారు చిత్ర బృందం. దీంతో అభిమానులలో ఒక్కొక్క అప్డేట్ తెలియజేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని సైతం విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


అక్టోబర్ 18 వ తేదీన కార్తి నటించిన జపాన్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్ అధికారికంగా తెలియజేయడం జరిగింది. జపాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లుగా ఇటీవలే డబ్బింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపుగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో కార్తీక్ నటించినట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. ఈ సినిమాలో సునీల్ విజయ్ మిల్టన్ ఇతర నటీనటుల సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


జపాన్ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్ పైన ఎస్ ప్రభు నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవలే కార్తి నటించిన పోన్నియన్ సెల్వన్ -2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. మరి జపాన్ సినిమాతో ఏ విధంగా అభిమానులను మెప్పిస్తారో చూడాలి మరి. గత ఏడాది కార్తీ నటించిన సర్దార్ సినిమా కూడా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా సీక్వెల్ పైన కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది. అలాగే ఖైదీ సినిమా సీక్వెల్ పైన కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్ సినిమాకి సంబంధించి ఈ అప్డేట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: