మహేష్ ఆలోచనలకు రాజమౌళి బ్రేక్ !

Seetha Sailaja
గుంటూరు కారం’ మూవీ షూటింగ్ పరుగులు తీస్తోంది. ఈమూవీ షూటింగ్ ను నవంబర్ నాటికి పూర్తి చేసి ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలచేసి తీరాలి అన్న పట్టుదలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పరుగులు తీస్తున్న నేపధ్యంలో ఆ ప్రయత్నాలకు మహేష్ నుండి సంపూర్ణ సహకారం లభిస్తున్నట్లు టాక్. నిన్న మొన్నటి వరకు ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ పూర్తి అయ్యాక మహేష్ మరో ప్రముఖ దర్శకుడుతో మరో మూవీని చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


ఈవిషయంలో అనీల్ రావిపూడితో ఆమూవీకి సంబంధించిన చర్చలు కూడ జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈవిషయాలు అన్నీ రాజమౌళి దృష్టి వరకు రావడంతో రాజమౌళి కార్తీకేయలు ఈమధ్య మహేష్ ను కలిసి మహేష్ తో తీయబోతున్న సినిమా కథ ఫైనల్ అయిందని ఆమూవీ స్టోరీ లైన్ మహేష్ కు చెప్పడమే కాకుండా జనవరి మూడవ వారం నుండి ఈసినిమాకు సంబంధించి ఈమూవీకి ఎంపిక అయిన నటీనటులతో నిర్వహించే వర్క్ షాప్ కు మహేష్ ను రెడీ అవ్వమని చెప్పడమే కాకుండా ఈమూవీ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నెల నుండి ప్రారంభం అయి 18 నెలలు కొనసాగే ఆస్కారం ఉందని జక్కన్న మహేష్ కు స్పష్టమైన క్లారిటీ చ్చినట్లు టాక్.


అంతేకాదు ఈమూవీలో మహేష్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్న విషయాన్ని మహేష్ కు వివరించడమే కాకుండా ఆ ఇద్దరి హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్ ఉంటుందని మహేష్ కు రాజమౌళి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు అని అంటున్నారు. దీనితో మహేష్ ‘గుంటూరు కారం’ తరువాత మరొక మూవీ చేయాలి అన్న ఆలోచనలు విరమించుకుని వచ్చే సంవత్సరం మార్చి నెలనుండి రాజామౌళికి అందుబాటులో ఉండాలి అన్న నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు గుప్పుమంతున్నాయిదీనితో మహేష్ తో మరో సినిమాను తీయాలి అని కలలు కంటున్న దర్శక నిర్మాతలకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: