రూటు మార్చిన చిరంజీవి.. ఈ లైనప్ చూస్తే అర్థమవుతుందిగా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు మెగా ఫ్యామిలీ అనే మహా వృక్షాన్ని స్థాపించి ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ఇక ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి అనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. అక్కడ కలిసి రాకపోవడంతో మళ్లీ తనకు అచ్చొచ్చిన సినిమాలే చేయడం మొదలుపెట్టారు.


 అయితే ఒకప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. రీ ఎంట్రీ తర్వాత మాత్రం రీమేక్ బాట పట్టారు అన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలలో సైరా నర్సింహారెడ్డి, ఆచార్య మినహా మిగతా అన్ని కూడా మిగతా భాషల నుంచి తెలుగులో రీమేక్ చేసినవే కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో స్ట్రైట్ గా తెలుగులో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. ఆ తర్వాత బోలా శంకర్ అనే రీమేక్ సినిమాతో వచ్చి డిజాస్టర్ చవి చూశారు.


 ఈ క్రమంలోనే రీమేక్ సినిమాలు తనికి అస్సలు అచ్చి రావట్లేదని చిరంజీవి అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది  ఈ క్రమంలోనే ఇక ఆ తర్వాత రాబోయే సినిమాల విషయంలో చిరంజీవి జాగ్రత్త పడుతున్నాడట  ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ మొదట రీమేకే అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ నిజంగానే రీమేకా కాదా అనే విషయంపై ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. అయితే బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత అన్ని స్ట్రైట్ మూవీస్ పైనే మెగాస్టార్ దృష్టి పెట్టారు.


 ఈ క్రమంలోనే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్టతో ఒక సోషియో ఫాంటసీ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు మెగాస్టార్. ఇక ఆ తర్వాత బడా దర్శకులైన త్రివిక్రమ్ సుకుమార్ అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. డీవివి దానయ్య నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తారని గతంలోని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు త్వరలోనే ఓకే అయ్యే ఛాన్స్ ఉందట  మరోవైపు నుంచి చిరు సుకుమార్ కాంబినేషన్ కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ఒక అదిరిపోయే కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఇక ఇవన్నీ చూస్తుంటే బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవిలో చాలానే మార్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: