కిరణ్ అబ్బవరం కు ఏమైంది ?

Seetha Sailaja
ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు తెచ్చుకుని హీరోగా సెటిల్ అవ్వడం అంత సులువైన పని కాదు. గతంలో ఉదయ్ కిరణ్ మధ్యకాలంలో రాజ్ తరుణ్ లాంటి హీరోలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి కెరియర్ లో చేసిన కొన్నికొన్ని పొరపాట్లు వల్ల తమకు వచ్చిన క్రేజ్ ను అంతా పోగొట్టుకున్నారు.


ఇప్పుడు ఆ లిస్టులోకి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చెరిపోతాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఎస్ ఆర్ కళ్యాణ మమండపం’ సినిమాకు కథ స్క్రీన్ ప్లే తానే స్వయంగా వ్రాసుకుని ఒక్కసారిగా హిట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్ హీరో తన సినిమాల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నాడా అంటూ ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయ పడుతున్నారు.


స్వతహాగా రచయిత అయినప్పటికీ ఈ యంగ్ హీరో తన కథల ఎంపిక విషయంలో ఎందుకు పొరపాట్లు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. లేటెస్ట్ గా విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలోని హాస్యం ఇప్పటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే హాస్యం కాదని కామెంట్స్ వస్తున్నాయి. ఈసినిమా ట్రైలర్ విడుదల అయిన తరువాత ఈమూవీ పై ఏర్పడ్డ అంచనాలు ఈమూవీ విడుదల అయ్యాక పూర్తిగా తొలగిపోయాయి. ఈసినిమాను చూసే సగటు ప్రేక్షకుడు తెగ నవ్వుకుంటాడు అంటూ ఈమూవీ ప్రమోషన్ లో ఊదరకొడుతూ చేస్తున్న ప్రచారం ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.


గతవారం విడుదల అయిన చిన్న సినిమాల పోటీలో కిరణ్ అబ్బవరం వెనక పడిపోయాడు. కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ యంగ్ హీరోతో సినిమాలు తీయడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ ఇలా వరస పరాజయాలు ఇతడిని ఇలా వెంటాడుతుంటే ఈ యంగ్ హీరో పరిస్థితి అయోమయంలో పడిపోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిన్న మీడియం రేంజ్ హీరోల మధ్య కూడ పోటీ విపరీతంగా ఉన్న పరిస్థితులలో ఈ యంగ్ హీరో తన కెరియర్ పట్ల శ్రద్ధ పెడితే బాగుంటుంది అంటూ మరికొందరి అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: