టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి తాజాగా బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో శ్రీ లీల ... బాలకృష్ణ కు కూతురి పాత్రలో కనిపించనుండగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ రోజు అనగా అక్టోబర్ 8 వ తేదీన రాత్రి ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను వరంగల్ లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఓ భారీ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇకపోతే ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న దర్శకులుగా కెరియర్ కొనసాగిస్తున్న బాబి , గోపీచంద్ మలినేని , వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.