బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో.. మూవీకి రెడీ అయిన చరణ్?
త్రిబుల్ ఆర్ సినిమాతో అటు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. దీంతో ఇప్పుడు చరణ్ సినిమా వస్తుందంటే చాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు చరణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఏకంగా స్టార్ డైరెక్టర్లు చెబుతున్న కథలు వింటూ నచ్చితే ఓకే చేసేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ తో ఒకసినిమా చేస్తున్నాడు. అదే సమయంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఒక స్పోర్ట్స్ డ్రామా చేసేందుకు రెడీ అయ్యాడు.
మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ ను చరణ్ ను లైన్లో పెట్టేసాడు అనేది తెలుస్తుంది. బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్న రాజ్ కుమార్ హిరానీ తో చరణ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముంబైలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలే ముంబైకి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ హిరని షారుక్ ఖాన్ తో డుంకి అనే సినిమా విషయంలో బిజీగా ఉండగా.. ఇక చరణ్ శంకర్ తో పాటు బుచ్చిబాబు సినిమాల విషయంలో బిజీగా ఉన్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.