కొత్త సెంటిమెంట్ ను నమ్ముకున్న రవితేజ !

Seetha Sailaja
‘ధమాక’ తో తన ఫ్లాప్ ల  పర్వానికి చెక్ పెట్టుకున్న రవితేజా   ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆతరువాతా వచ్చిన అతడు హీరోగా నటించిన సినిమా ఫ్లాప్ అవవడంతో రవితేజా తన స్టామినాను మళ్ళీ నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఏకంగా బాలకృష్ణ హీరో విజయ్ ల భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడుతూ పాన్ ఇండియా మూవీగా హిందీ బెల్ట్ లో కూడ విడుదల అవ్వడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అంటున్నారు.



వాస్తవానికి రవితేజా కు తెలుగు ప్రేక్షకులలో ఉన్నంత స్థాయిలో హిందీ ప్రేక్షకులలో మాస్  మహారాజా కు సరైన గుర్తింపు లేదు. దీ నితో అతడి సినిమాలను గతంలో పాన్ ఇండియా మూవీలుగ విడుదల చేసిన సందర్భాలు లేదు. అయితే ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ విషయంలో పద్ధతి మారింది. రవితేజా హీరో అవ్వకముందు సినిమాల పై ఉన్న అభిమానంతో ముంబాయి వెళ్ళి అక్కడ కొన్ని హిందీ సినిమాలకు సహాయ దర్శకుగ పని చేశాడు అని అంటారు.



కొన్ని సంవత్సరాల పాటు రవితేజా ముంబాయి మహానగరంలో ఉండటంతో ఆ మహానగరంలో మాస్ మాట్లాడుకునే హిందీ యాస బాగా వచ్చింది అన్న అబిప్రాయం చాలామందికి ఉంది. ఇప్పుడు ‘టైగర్’ నాగేశ్వర రావు’ విషయంలో ఈమూవీకి సంబంధించిన హిందీ డబ్బింగ్ ను రవితేజా తన సొంత గొంతుతో చెప్పాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ లు తాము నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి హిందీ వెర్షన్స్ కు డబ్బింగ్ ఆర్టిస్టుల పై ఆధారపడుతూ ఉంటే రవితేజా మాత్రం తన సొంత వాయిస్ తో తన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీకి డబ్బింగ్ చెపుతున్న నేపధ్యంలో ఈవిషయంలో అతడికి ఏర్పడే ప్రత్యేకమైన ఇమేజ్ తనను  బాలీవుడ్ లో నిలబెదుతుంది అన్న సెంటిమెంట్ ను మాస్ మహారాజ నమ్ముకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.. .





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: