స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!

Anilkumar
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్ వంటి సినిమాలు తో టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ అందరికీ సుపరిచితమే  చాలా తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేసే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అలాంటి సిద్ధార్థ్ తాజాగా ఓ వేదికపై ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. అప్పట్లో అగ్ర హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధార్థ్ కి కొంతకాలం తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయాడు. 


అలా ఇటీవల 'టక్కర్' అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈమధ్య తమిళంలో సిద్ధార్థ్ 'చిత్త' అనే సినిమా చేశాడు. ఈ మూవీని తమిళంతో పాటు కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశాడు. అక్కడ సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రశంసలు అందుకోవడమే కాక ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇది అని విమర్శకులు
సైతం ఈ చిత్రాన్ని కొనియాడారు. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా అప్పుడే రిలీజ్ చేయాలని అనుకున్నా ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో కాస్త ఆలస్యంగా ఎట్టకేలకు ఈ వారం రిలీజ్ చేస్తున్నాడు. 'చిన్నా' అనే పేరుతో తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు."


 తమిళనాడులో రెడ్ జాయింట్ వాళ్లు సినిమా చూసి ఇలాంటి గొప్ప సినిమా చూడలేదని ఉదయనిది నా సినిమాని కొన్నారు. కేరళలో నంబర్ వన్ నిర్మాతగా గోకులం గోపాలం గారు సినిమా చూసి కొన్నారు. కర్ణాటకలో కేజిఎఫ్ సినిమా నిర్మాతలు నా సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదని కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికొస్తే 'సిద్ధార్థ సినిమా ఎవరు చూస్తారు'? అని అడిగారు. సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారండి? ఎందుకు చూస్తారు? అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చూస్తే ప్రేక్షకులు నా సినిమా కచ్చితంగా చూస్తారని నేను చెప్పాను అంటూ స్టేజ్ పైనే సిద్ధార్థ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: