విజయ్ దేవరకొండ సినిమాకు 100 కోట్ల బడ్జెట్.. కరెక్టేనా..?

Divya
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. టైర్ -2  హీరోలలో అత్యధిక మార్కెట్ కలిగిన హీరోగా పేరుపొందారు విజయ్ దేవరకొండ. విజయ్ మూవీ ఏదైనా సరే ఈజీగా 50 నుంచి 60 కోట్ల మార్కును దాటేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ కెరియర్లో సక్సెస్ ల కంటే ఫ్లాపులు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా బడ్జెట్లో విషయంలో ఎక్కడ అభిమానులను నిరాశపరచలేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడానికి పలు రకాల బ్యానర్స్ సైతం సిద్ధంగా ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉన్నట్లు సమాచారం. మొదటిసారి విజయ్ దేవరకొండ కెరియర్ లో కంప్లీట్ గా యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న కదా అంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. విజయ్ దేవరకొండ  సినిమాల బిజినెస్ కారణంగానే ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే అంతకంటే లాభం వచ్చే స్టామినా ఉందా అనే విషయం కూడా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ సినిమాకి చోటు చేసుకోవడంతో ఈ సినిమాకి అంత బడ్జెట్ తీసుకువెళ్లబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు న్యాచురల్ స్టార్ నాని మాత్రమే టైర్ -2 హీరోలలో 100 కోట్ల క్లబ్లో చేరారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎంతవరకు అభిమానులను నేర్పిస్తుంది చూడాలి పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: