'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అఖండ వీర సింహారెడ్డి వంటి వరుస విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  
 అందుకు తగ్గట్లుగానే సినిమాలో బాలయ్యను నెవర్ బిఫోర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. 

ఇందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫాన్స్ లో ఫుల్ జోష్ ని నింపుతోంది. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సాంగ్ 'గణేష్ అంథమ్' అనూహ్య స్పందనను రాబట్టింది. ఇక సినిమా నుంచి రెండవ సింగిల్ కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఉయ్యాల ఉయ్యాల' అంటూ సాగే రెండవ సింగిల్ ని అక్టోబర్ 4న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీనికంటే ముందు మేకింగ్ వీడియో సైతం విడుదల చేశారు. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ బాగా హైలైట్ అవ్వడంతో సినిమాలో ఇలాంటి  డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ట్రైలర్ను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.

 అనిల్ రావిపూడి ఇప్పటికే ట్రైలర్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 8న ఓ ఈవెంట్ ని నిర్వహించి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. 'భగవంత్ కేసరి'లో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలయ్య కనిపించనున్నారట. గిరిజనులలో ఒకరిగా ఆయన పాత్ర ఉంటుందని చెబుతున్నారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో కమర్షియల్ అంశాలను జోడిస్తూ సినిమాలో ప్రస్తావించబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: