ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ నటుడు ప్రతి సినిమాకు తనదైన రీతిలో కష్టపడుతూ అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు తన నటనతో మాత్రమే కాకుండా తన అదిరిపోయే డ్యాన్స్ తో ... యాక్షన్ సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా కష్టపడడానికి నేను రెడీ అని ఎన్నో సందర్భాలలో నిరూపించుకున్న రామ్ తాజాగా స్కంద సినిమాలో హీరోగా నటించాడు.
ఇకపోతే ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించి ప్రేక్షకులను రామ్ అలరించాడు. ఈ సినిమాలో ఓక పాత్ర కోసం రామ్ చాలా రోజులు కష్టపడి 12 కిలాల బరువును పెరిగాడట. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం ... ఈ సినిమాలో రామ్ ఓ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించగా ... మరో పాత్రలో చాలా గంభీరంగా కనిపించాడు. ఈ గంభీరమైన పాత్ర కోసం రామ్ 72 కేజీల బరువు నుండి 84 కేజీల వరకు పెరిగాడట. ఇలా రామ్ పాత్ర కోసం ఏదైనా చేయడానికి రెడీ అని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు.
ఇకపోతే స్కంద మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ , శ్రీకాంత్., ప్రిన్స్ ముఖ్య పాత్రలలో నటించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు.