బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. భగవంత్ కేసరి ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

Divya
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది ఆయన సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫుల్ మాస్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించి మాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్,  సింగిల్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శ్రీ లీల కూడా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అవ్వగా చిత్రం యొక్క ట్రైలర్ ను  అక్టోబర్ 8వ తేదీన లాంచ్ చేయబోతున్నట్లు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారడం గమనార్హం.
మరొకవైపు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ .75 కోట్లకు బిజినెస్ జరిగిందని సమాచారం. అంతేకాదు బాలయ్య సినీ కెరియర్ లోనే ఈ సినిమాకు అత్యధిక బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. గతంలో బాలయ్య సినిమాల బిజినెస్ విషయానికి వస్తే..  వీరసింహారెడ్డి రూ.73 కోట్లు , అఖండ రూ.54 కోట్లు,  ఎన్టీఆర్ కథానాయకుడు రూ.70 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మరొకసారి అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియంటెడ్ మూవీ తో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: