విడాకులు తీసుకోబోతున్న భీమ్లా నాయక్ నటి..!!

Divya
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల పెళ్లి విడాకుల వ్యవహారాల గురించి తరచు ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది. గ్రాండ్గా వివాహం చేసుకున్న వారు చెడి చప్పుడు లేకుండా విడిపోతున్నారు.. సమంత, నిహారిక, మంచు మనోజ్ తదితర సెలబ్రిటీల సైతం ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు నటి కూడా విడాకులు తీసుకోబోతోంది అని సందేహాలకు దారి తీసేలా చేస్తోంది. ఆమె ఎవరో కాదు భీమ్లా నాయక్ సినిమాలో నటించిన మౌనిక రెడ్డి.

మొదట షార్ట్ ఫిలిం లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి సూర్య అనే వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాలో కానిస్టేబుల్ గా నటించింది.. అలాగే కొన్నేళ్లుగా సందీప్ అనే వ్యక్తితో ఏమి రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత వీరిద్దరూ కలిసి గత ఏడాది డిసెంబర్లో గోవాలో డిస్టినేషన్ వెడ్డింగ్ అని సైతం  చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పెళ్లి టైం లో మౌనిక చాలా ఎక్సైట్ అవుతూ పలు రకాలు వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా తాజాగా ఇమే పెళ్లి ఫోటోలు అన్నిటిని తన ఇంస్టాగ్రామ్ లో డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో పలువురు అభిమానులకు సైతం అనుమానాలు వచ్చేలా చేస్తోంది.తన భర్త సందీప్ ని కూడా అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది దీంతో వీరిద్దరూ త్వరలోనే బ్రేకప్ కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ త్వరలోనే ఈ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. చూడడానికి అచ్చం హీరోయిన్ మెటీరియల్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. ఇక ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: