స్కంద "ఓటిటి" రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ... స్ట్రీమింగ్ ఎప్పటినుండో తెలుసా..?

Pulgam Srinivas
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా స్కంద అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ , శ్రీకాంత్ , ప్రిన్స్ కీలక పాత్రలలో నటించగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది.

అయినప్పటికీ ప్రస్తుతం ఈ మూవీ కి పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన "ఓ టి టి" హక్కులను ప్రముఖ సంస్థకు భారీ ధరకు అమ్మి వేసినట్లు ... అందులో భాగంగా ఈ ఆ "ఓ టి టి" సంస్థ వారు ఈ మూవీ మేకర్స్ తో ఈ మూవీ యొక్క "ఓ టి టి" విడుదల తేదీని కూడా ఇప్పటికే లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ ని అక్టోబర్ 27 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram

సంబంధిత వార్తలు: