నాగార్జున సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రోజు బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక వరుస సినిమాల్లో నటిస్తూనే నాగార్జున "బిగ్ బాస్" టీవీ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నాడు. ఇకపోతే నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయ్యింది.

ఇకపోతే ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందబోతుంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరూ ముద్దు గుమ్మలు ఆడిపాడబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా ఆశిక రంగనాధ్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మిర్న మీనన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటిక నా సామి రంగ సినిమా నుండి చిత్ర బృందం రెండు పోస్టర్ లను ఒక చిన్న వీడియో ను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: