"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోధ్ లు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయగా ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది.  దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి.
 

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని చాలా లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన "ఓ టి టి" విడుదల తేదీ వచ్చేసింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను అక్టోబర్ 5 వ తేదీ నుండి తెలుగు , తమిళ  , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో  స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే అక్టోబర్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: