"మామ మచ్చింద్ర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

frame "మామ మచ్చింద్ర" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితమే హంట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా  ఈ నటుడు హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన మామ మచ్చింద్ర అనే ఒక డిఫరెంట్ జోనర్ మూవీ లో హీరో గా నటించాడు.  సుధీర్ ఏకంగా ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే  ఇందుకు సంబంధించిన పోస్టర్ లను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదికను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 2 వ తేదీన "జే ఆర్ సి" కన్వెన్షన్ , హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: