
నా ఫస్ట్ క్రష్ అతడే అంటున్న ప్రియమణి..!!
అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ,కోలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న ప్రియమణి.. ఆమెకు వచ్చే క్యారెక్టర్ రోల్స్ ని సైతం అందరూ గుర్తుపెట్టుకునే విధంగా నటిస్తోంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది ప్రియమణి.. జవాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి.. బాలీవుడ్ నటులలో ఎవరిపైన క్రష్ ఉంది అనే ప్రశ్న ఎదురవగా.. బాలీవుడ్ యాక్టర్స్ లో ఎవరు స్టైల్ వారికుంటుంది.. తనకు చాలామంది ఇష్టమైన నటులు ఉన్నారని కొన్ని అభిమాన పాత్రలు కూడా ఉన్నాయని తెలియజేసింది ప్రియమణి.
తనకు ఫస్ట్ నుంచి క్రష్ గా ఉన్న హీరోలలో ఏకైక హీరో షారుక్ ఖాన్ అని తెలియజేసింది.. లక్కీ క షారుక్ ఖాన్ పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసింది ప్రియమణి ఆయనతో మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి అయినా సిద్ధంగానే ఉన్నాను అంటూ తెలిపింది ప్రియమణి.. ప్రస్తుతం పుష్ప -2 లో కూడా నటిస్తున్నట్లు సమాచారం .ఈమె పాత్రకు సంబంధించి ఎలాంటి విషయాన్ని కూడా తెలియజేయలేదు. ఈమె పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది .ఇందులో ఎన్టీఆర్ తల్లి పాత్రలో అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.