ఏంటి.. ఎన్టీఆర్ వల్లే బాహుబలి సినిమా ఇంత పెద్ద హిట్ అయిందా..!?

Anilkumar
టైటిల్ చూసి జూనియర్ ఎన్టీఆర్ కి బాహుబలి సినిమాకి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.. అసలు జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి సినిమాలో లేడు.. అలాంటిది బాహుబలి సినిమా హిట్ అవ్వడంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏముంది అనే కదా మీ అనుమానం.. మరి బాహుబలి సినిమా హిట్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా కారణమయ్యాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని


 పాన్ ఇండియా హీరో అయ్యాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది హీరోలు తాము చేసే సినిమాల్లో మార్పులు చేసుకుంటూ భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అలానే మార్పులు చేసుకుని ఫ్లాప్స్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో భూమిక ఎన్టీఆర్ ని పొడుస్తుంది. ఆ సన్నివేశాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళికి చెప్పారట..హీరోయిన్ కి గతం


 గుర్తుకు వచ్చి హీరోని పొడుస్తే చాలా బాగుంటుంది.. ఇది ఆడియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట. దాంతో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అయ్యి ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. బాహుబలి సినిమాలో సైతం ఇలాంటి సన్నివేశాన్ని పెట్టారు రాజమౌళి. క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే సీన్ ఎవరికి అర్థం కాకుండా క్లైమాక్స్ ను డిజైన్ చేశారు. ఎందుకు అంటే బాహుబలి 2 విడుదల అయ్యే వరకు చాలామంది ఎందుకు బాహుబలిని కట్టప్ప చంపాడు అన్న ఎక్సట్మేట్ ఉండాలి అని ఇలా చేశారు. అయితే బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి కి జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది గుర్తుకు రావడంతో ఈ సినిమాలో సైతం సింహాద్రి సినిమా క్లైమాక్స్ ను పోలిన క్లైమాక్స్ పెట్టారు. అలా పరోక్షంగా బాహుబలి సినిమా హిట్ అవ్వడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: