టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయిన రవిబాబు స్పందించారు. చంద్రబాబు గారికి వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆయన తెలియజేశారు.మనిషి జీవితంలో ఏవీ కూడా శాశ్వతం కావు. రాజకీయ నాయకులకు ఇప్పుడు వున్న పవర్ కూడా శాశ్వతం కాదు.అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కావు. త్వరలోనే ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ తొలిగిపోతాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుటుంబం అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీకి మంచి ఆప్తులు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఏదైనా పనిచేసే ముందు ఎంతగానో ఆలోచన చేసి, అందరినీ సంప్రదించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. భూమి మీద ఈ రోజే లాస్ట్ డే అని తెలిసినా కూడా ఆయన తర్వాత యాభై సంవత్సరాలకు సోషల్ డెవలప్ మెంట్ గురించి ప్లాన్ చేస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి అయితే కాదు. ప్రతి క్షణం ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తారు.
అలాంటి మంచి వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపకుండా అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో అర్ధం కావటం లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం. కానీ 73ఏళ్ల వయసు లో వున్న ఆయనను జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణం. అశాశ్వతమైన పవర్ లో ఉన్న వాళ్లకు నా రిక్వెస్ట్. మీరు ఏ పవర్ నైతే వాడి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారో.. దయచేసి అదే పవర్ ఉపయోగించి ఆయనను బయటకు వదిలేయమని వేడుకుంటున్నాను.. మీరు తలుచుకుంటే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయనను జైలులో కాకుండా బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయనైతే దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోరు.. చరిత్ర లో మీ నాయకత్వాన్ని ఎలా గుర్తుంచుకోవాలి.కక్ష తో రగిలిపోయే నాయకులాగానా లేదా జాలి మనసు, దయ, మోరల్స్ ఉన్నా నాయకుల్లాగానా అనేది మీరే ఆలోచించుకోండి. దయచేసి చంద్రబాబు గారిని వదిలేయండి.. అంటూ రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.